ETV Bharat / state

న్యాయవాది కేసు: అఫిడవిడ్ దాఖలు చేయాలని డీజీపీని ఆదేశించిన హైకోర్టు

author img

By

Published : Jul 21, 2020, 7:11 PM IST

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన న్యాయవాది సుభాష్ చంద్రబోస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు కోర్టుకు హాజరైన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి న్యాయవాది తమ ఆధీనంలో లేరని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు డీజీపీని ఆదేశించింది.

న్యాయవాది కేసు : అఫిడవిడ్ దాఖలు చేయాలని డీజీపీని ఆదేశించిన హైకోర్టు

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన న్యాయవాది సుభాష్ చంద్రబోస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన భార్య పి.వెంకట ప్రియదీప్తి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంటకు ప్రత్తిపాడు, ఏలేశ్వరం పోలీసులు.. తమ ఇంటికి వచ్చి తలుపులు బద్దలుకొట్టి తన భర్తను నిర్బంధించి తీసుకెళ్లారని హెబియస్ కార్పస్ రిట్ వేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. గత విచారణలో న్యాయవాదిని కోర్టు ముందు హాజరుపర్చాలని ధర్మాసనం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించింది. అలాగే ఎస్పీని కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది.

న్యాయవాది పోలీసుల అదుపులో లేరు

మంగళవారం ఎస్పీ నయీమ్ అస్మి హైకోర్టుకు హాజరయ్యారు. న్యాయవాది సుభాష్​ చంద్రబోస్ పోలీసుల అదుపులో లేరని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ ఘటనపై డీఐజీ స్థాయి అధికారి విచారణకు డీజీపీ ఆదేశించారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

ఇదీ చదవండి : నాటి దేశీయ వరి రకం.. ఆరోగ్యానికి వరం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.