ETV Bharat / state

'ప్రజాస్వామ్య వ్యవస్థలను హైకోర్టు తీర్పు కాపాడింది' - హైకోర్టు తీర్పుపై కళా వెంకట్రావు స్పందన

ప్రజాస్వామ్య విలువల్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను హైకోర్టు తీర్పు కాపాడిందని తెదేపా నేత కళా వెంకట్రావు పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఏ తప్పూ చేయకున్నా... ప్రభుత్వం కక్షపూరితంగా పదవి నుంచి తొలగించిందని ధ్వజమెత్తారు.

kala venkata rao
kala venkata rao
author img

By

Published : May 29, 2020, 7:20 PM IST

మీడియాతో కళా వెంకట్రావు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా నిమ్మగడ్డ రమేశ్​కుమార్​ను తిరిగి నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు స్వాగతించారు. ప్రజాస్వామ్య విలువల్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను హైకోర్టు తీర్పు కాపాడిందని ఆయన అభిప్రాయపడ్డారు. నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఏ తప్పూ చేయకున్నా... కక్షపూరితంగా పదవినుంచి తొలగించారని కళా మండిపడ్డారు. సీఎం జగన్ కక్షపూరిత నిర్ణయాలపై హైకోర్టు సరైన సమయంలో సరైన తీర్పు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని కళా వెంకట్రావు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి

ప్రభుత్వానికి షాక్.. ఎస్​ఈసీగా మళ్లీ రమేశ్​ కుమార్ నియామకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.