తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 4 మండలాల్లో సుమారు 20 గ్రామాలకు నేటికీ పూర్తి స్థాయిలో తాగునీరు సరఫరా కావడం లేదు. పదేళ్ల క్రితం వేసిన పైపులైన్లు పాడవడం, గ్రామ జనాభాకు తగినన్ని కుళాయిలు ఏర్పాటు చేయకపోవడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు వాపోతున్నారు.
ప్రభుత్వాలు మారినా.. ప్రజా ప్రతినిధులు మారినా.. పల్లె ప్రజల తాగునీటి బాధలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: