తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి రూపం దాల్చింది. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య ఆధ్వర్యంలో 5 సెంటర్ అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దేవీపట్నంతో పాటు తొయ్యరు, వీరవరం, దండంగి, పోచమ్మ గండి గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆయా గ్రామాల్లోకి నీరు వచ్చి చేరటంతో రంపచోడవరంలో నాలుగు సహాయక కేంద్రాలతో పాటు దేవీపట్నం మండలం ముసునిగుంటలో ఒక సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ముంపు గ్రామాల ప్రజలను తరలించేందుకు ప్రత్యేక పడవలను, బోట్లను ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దేవీపట్నంలో కొంతమంది భయాందోళనతో సహాయ కేంద్రానికి తరలి వెళ్లారు. ముంపు బాధితులకు సహాయార్థం రంపచోడవరం ఐటిడిఎ కార్యాలయంలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బాధితుల సహాయార్థం ఫోన్ నెంబర్: 08864 243142 ను సంప్రదించాలని ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య అన్నారు.
ఇదీ చూడండి