తూర్పు గోదావరి జిల్లా కోనసీమ సముద్ర తీర ప్రాంతం ముందుకు చొచ్చుకొచ్చింది. ఇటీవల తుపాను వచ్చినప్పటి నుంచి సముద్రంలో కెరటాల ఉధృతి ఎక్కువగా ఉందని స్థానికులు అంటున్నారు.
సఖినేటిపల్లి మండలం, అంతర్వేది, పల్లిపాలెం,పోలవరం మండలం, భైరవపాలెం వరకు సముద్రంలో కెరటాలు నాలుగైదు రోజులుగా ఎగసిపడుతున్నాయని చెప్పారు. ఆయా ప్రాంతాలలో సముద్రం 50 నుంచి 100 మీటర్ల మేర ముందుకు వచ్చిందని తీర ప్రాంత ప్రజలు కలవరపడుతున్నారు.
ఇదీ చదవండి: