అత్యాశకు పోయి గుట్కా , పాన్ వంటి నిషేధిత పదార్థాలను అమ్మవద్దని వ్యాపారులకు తూర్పుగోదావరి జిల్లా మండపేట రూరల్ ఎస్సై దొరరాజు సూచించారు. మండలంలోని ద్వారపూడి సంత మార్కెట్ సమీపంలో గుట్కా, పాన్లు అమ్ముతున్న ఇద్దరు వ్యాపారులను అదుపులోకి తీసుకుని.. వారి దగ్గర నుంచి భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
పట్టణంలోని పలు దుకాణాల్లో గుట్కాలు అమ్ముతున్నారని తెలిసి దాడులు నిర్వహించగా భారీగా ప్యాకెట్లు పట్టుబడినట్లు ఎస్సై వెల్లడించారు. వీటిని విక్రయిస్తున్న ఇద్దర్ని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశామని... కోర్టుకు తరలిస్తామని చెప్పారు. నిషేధిత ప్యాకెట్లు ఎవరు విక్రయించినా చర్యలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి: