తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ములకల్లంకలో దారుణం చోటు చేసుకుంది. 77 ఏళ్ల వృద్ధురాలిని మనవడే నరికి చంపడం కలకలం రేపింది. పెండ్యాల అరవాలమ్మకు పెంకుటిల్లు, రెండెకరాల పొలం ఉంది. ఈ ఆస్తికి సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య వివాదం నెలకొంది. న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ క్రమంలో వృద్ధురాలితో ఘర్షణ పడ్డారు. మనవడు పెండ్యాల రవి కోపంతో వృద్ధురాలిని గొడ్డలితో నరికేశాడు. రక్తపు మడుగులో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి