ధర్మాడి సత్యం రాష్ట్రానికి హీరోగా నిలిచారని... ఆయన సేవలు ఎంతో అవసరమని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా కొనియాడారు. కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటును బయటకు తీయడం పట్ల... వైఎస్సార్ జీవిత కాల సాఫల్య పురస్కారానికి ప్రభుత్వం ఎంపిక చేసిందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ధర్మాడి సత్యంను ఘనంగా సన్మానించారు. నగదు పురస్కారం అందజేశారు. తనను పురస్కారానికి ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు ధర్నాడి కృతజ్ఞతలు చెప్పారు.
ఇవీ చదవండి...ఆరోగ్యశ్రీ సేవలు విస్తరణ..పోస్టర్ ఆవిష్కరించిన సీఎం