GOODS TRAIN DERAILED : రాజమహేంద్రవరం స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తైంది. సిబ్బంది శరవేగంతో ట్రాక్ మరమ్మతు పనులు పూర్తి చేయడంతో.. యథావిధిగా రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటలకు స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగింది. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఒకే ట్రాక్‌పై రాకపోకలు కొనసాగాయి.
అసలేం జరిగిందంటే: రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కోల్‌కతా-చెన్నై మార్గంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో రైలు పట్టాలు తప్పి.. ఒకవైపు ఒరిగిపోయింది. రైలు ప్రమాదానికి గురైన మార్గంలో మరమ్మతులు కొనసాగుతుండటంతో.. సింగిల్ ట్రాక్‌పైనే రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ఫలితంగా కోల్‌కతా-చెన్నై మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో... 9 ప్యాసింజర్ రైళ్లు రద్దు కాగా 2 రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. విజయవాడ-లింగంపల్లి రైలు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. విజయవాడ-విశాఖ, విశాఖ-విజయవాడ మధ్య రైళ్లు రద్దయ్యాయి. అలాగే గుంటూరు-విశాఖ, విశాఖ-గుంటూరు రైళ్లు.. విజయవాడ-గుంటూరు రైళ్లు రద్దయ్యాయి. కాకినాడ పోర్టు-విజయవాడ రైళ్లు రద్దు కాగా.. విజయవాడ-రాజమహేంద్రవరం రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి.
ఇవీ చదవండి: