వైకాపా ప్రభుత్వంపై తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు విమర్శలు చేశారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురులో మాట్లాడుతూ.. అమరావతి రైతులను సీఎం జగన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. వారికి నష్టం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధంగా ఎంపిక చేసిన అమరావతే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉండాలన్నారు.
ఇవీ చదవండి..