తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని గోదావరి నది పాయలు వారం రోజుల క్రితం వరకు నీలి రంగులో ఉన్నాయి. ఇప్పుడు నీరు ఎరుపు రంగుగా మారి జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాలలో వర్షాలు కురవడంతో ధవళేశ్వరం బ్యారేజ్లో ఎర్రటి రంగు వరద నీరు చేరుతుంది. ఆ నీటిని తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమగోదావరి జిల్లాలోని పశ్చిమ డెల్టా కాలువలకు విడుదల చేస్తున్నారు.
సుమారు 54 క్యూసెక్కుల వరద నీటిని ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వదులుతున్నారు. కోనసీమలోని వశిష్ట, గౌతమి, వైనతేయ, గోదావరి నదీ పాయల్లో వరద నీటితో జలకళ సంతరించుకుంది. గోదావరి నదికి ఎర్రనీరు తగిలిందంటే...మత్స్యకారులు ముహూర్తాలు చూసుకుని చేపలవేటకు వెళతారు.