దేవీపట్నం వద్ద గోదావరి వరద ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తొయ్యేరు, దేవీపట్నం, పూడిపల్లి, దండంగి, ఎ.వీరవరం, పోచమ్మగండి, గానుగులగొందు, పాతూరు గ్రామాల్లో జలదిగ్భంధం అయ్యాయి.1500 ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరద పెరగటంతో రెండ్రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దేవీపట్నం గండిపోచమ్మ ఆలయాన్ని వరద నీరు ముంచ్చెత్తింది. కచ్చులూరు నుంచి కొండమెుదలు వరకు గోదావరి నదీ ఒడ్డున ఆనుకుని ఉన్న 20 గ్రామాల గిరిజనులు వరదతో భయాందోళనలో ఉన్నారు.
ఇవీ చదవండి