తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీకి అంతకంతకూ పెరుగుతున్న గోదావరి వరదను సముద్రంలోకి వదలడంతో దిగువనున్న లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయల తోటలు ముంపునకు గురయ్యాయి. ముమ్మిడివరం మండలం పరిధిలోని గురజాపు లంక, లంకాఫ్ ఠాణ్ణేలంక, కూనాలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి లంకలోని వంగ, మునగ, బెండ, ఆనబ, మిర్చి తోటలు వరద నీటిలో మునిగి పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. ముంపు గ్రామాల ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండీ... ఉద్ధృతంగా గోదావరి... వణికిపోతున్న ముంపు గ్రామాల ప్రజలు