రేపు జరగాల్సిన గీతం విశ్వవిద్యాలయం దూరవిద్య డిగ్రీ ప్రశ్నాపత్రం లీక్ కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఎస్వీఎస్ అనే ప్రైవేట్ విద్యాసంస్థ ద్వారా ప్రభుత్వ పాలనా శాస్త్రం పరీక్ష ప్రశ్నాపత్రం బయటకు వచ్చింది. ఎస్వీఎస్ విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి... ప్రశ్నాపత్రాల నకళ్లు పంచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రేపు జరగాల్సిన ప్రశ్నాపత్రం సైతం జిరాక్స్ తీస్తుండగా... మీడియా అక్కడకు చేరుకుంది. ఇది గమనించిన కాలేజ్ యాజమాన్యం తలుపులు మూసివేసింది.
ఇవీ చూడండి-ఏపీ ఈసెట్ 2019 ఫలితాలు విడుదల