రాష్ట్రవ్యాప్తంగా జీసీసీలో పని చేస్తున్న కళాసీలు మంగళవారం సమ్మెకు పిలుపునివ్వగా.. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో ఆ సంస్థ డివిజినల్ మేనేజర్ కార్యాలయం ఎదుట నిరాహారదీక్ష చేపట్టారు. పెంచిన వేతనాలతో పాటు ప్రోత్సాహకాలు చెల్లించడం లేదని.. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలోని గిరిజన సహకార సంస్థ(జీసీసీ)లో కళాసీలుగా పని చేస్తున్న 300 మంది ఆవేదన వ్యక్తం చేశారు.
జీసీసీ గోదాముల్లో నిత్యావసర సరుకులను లారీల్లో ఎక్కించడం, దించడం చేసినందుకు క్వింటాకు గతంలో రూ.19లు చెల్లించేవారని కూలీలు తెలిపారు. తమ ఆందోళన ఫలితంగా క్వింటాకు రూ.22 కూలీ పెంచుతూ హామీ ఇచ్చారని..కానీ ఏడాది నుంచి ఆ మేరకు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పౌరసరఫరాల శాఖలో పని చేస్తున్న కళాసీలకు పెంచిన వేతనాలు చెల్లిస్తున్నారని.. తమకు అందడం లేదని వాపోతున్నారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.
ఇదీ చదవండి: