ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 75 కిలోల గంజాయిని తూర్పు గోదావరి జిల్లా డొంకరాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకు విలువ రూ.2.25 లక్షలు ఉంటుందని ఎస్సై వెంకటేశ్వరరావు అంచనా వేశారు.
గంజాయి, కారును సీజ్ చేశామని చెప్పారు. వై.రామవరం మండలం ఎల్లవరానికి చెందిన పల్లాల శ్రీనివాస్ రెడ్డి, విశాఖ జిల్లా సీలేరు బెంగాలీ క్యాంపుకు చెందిన బైరాగి నరేష్ ను అరెస్టు చేశామని.. రంపచోడవరం కోర్టుకు తరలిస్తామని ఎస్సై చెప్పారు.
ఇదీ చదవండి:
మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా భారీ మద్యం, నాటు సారా పట్టివేత