లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. తన స్వగృహంలో పార్టీ నాయకులతో కలిసి దీక్షను ప్రారంభించారు. ఆపద సమయంలో పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆరోపించారు. అన్న క్యాంటీన్లను తక్షణమే తెరచి.. చంద్రన్న బీమాను పునరుద్ధరించాలన్నారు.
ఇదీ చదవండి..