కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గ శాసనసభ్యుడు, పుదుచ్చేరి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి.. మల్లాడి కృష్ణారావుకు ఆ ప్రాంత ప్రజలకు ఉన్న అనుబంధం 25 ఏళ్లనాటిది. ఆయన పుట్టినరోజున ప్రతీ ఏటా సంబరాలు జరుపుతారు. ఈసారి కరోనా వ్యాప్తితో వేడుకలకు దూరంగా ఉన్నారు. కానీ కార్యకర్తలు, నాయకులు స్వయంగా సేకరించిన డబ్బులతో మల్లాడి కృష్ణారావు సందర్భంగా నాలుగువేల మంది నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. వాటితో పాటు కూరగాయలు, బియ్యం అందించారు.
ఇదీ చదవండి: 9న సీఎం జగన్తో సినీ ప్రముఖుల సమావేశం