వరదల కారణంగా తూర్పుగోదావరి జిల్లా ఏలేరు జలాశయం నిండుకుండను తలపిస్తోంది. వరద ఉద్ధృతి పెరగటం వల్ల జలాశయం నుంచి 15 వేల 5 వందల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గొల్లప్రోలు, ఏలేరు ప్రాంతాలను మూడో రోజూ వరదలు చుట్టుముట్టాయి. కొడవలిచెరువు, సుబ్బారెడ్డిసాగర్, సుద్దగడ్డ ఏకమై గొల్లప్రోలును ముంచెత్తటం వల్ల కొత్త కాలువకు గండి పడింది. ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం వద్ద వంతెన కూలి రాకపోకలు నిలిచిపోయాయి. 50 వేల ఎకరాలకు పైగా వరి, పత్తి, ఉద్యానవన పంటలు నీటమునిగాయి. తూర్పు, మధ్య డెల్టాల్లోనూ పంట నీటి పాలైంది. తమను ప్రభుత్వమే ఆదుకుని పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: