తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని వివిధ గ్రామాల్లో గుర్తు తెలియని దుండగులు ఐదు దేవాలయాల్లోని హుండీలు పగులగొట్టి దోచుకెళ్లారు. శ్రీకృష్ణపట్నంలో అభయ ఆంజనేయ స్వామి, కోదండ రామాలయం.. శ్రీరాంపురం గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడి, ప్రసన్న ఆంజనేయస్వామి గుడి, దుర్గమ్మ గుడిలో దోపిడీలు జరిగాయి. క్లూ టీమ్స్ వచ్చి ఆధారాలు సేకరించారు. ఆలయ కమిటీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సుభాష్ తెలిపారు.
ఇది చదవండి ఏ విపత్తుకైనా ప్రకృతిలోనే పరిష్కారాలు!