ETV Bharat / state

కాకినాడలో విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం - కాకినాడలో అగ్నిప్రమాదం తాజా వార్తలు

కాకినాడ వెంకట్​నగర్​లో విద్యుదాఘాతంతో సంభవించిన.. అగ్నిప్రమాదంలో ఓ ఇల్లు దగ్ధమైంది. ఉదయం ఇంటి పై భాగం నుంచి పొగతో ఒక్కసారిగా మంటలు వ్చచాయి. ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా బయటకు పరుగులు తీశారు. ఇంట్లో ఉన్న సామగ్రి, నగదు మంటల్లో కాలిపోయాయి. సుమారు రూ. 8 లక్షలు ఆస్తి నష్టం జరగుండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Fire with electric shock in Kakinada
కాకినాడలో విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం
author img

By

Published : Mar 22, 2021, 4:28 PM IST

కాకినాడలో విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వెంకట్‌నగర్‌లో.. విద్యుదాఘాతంతో సంభవించిన అగ్నిప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఉదయం 7 గంటలకు ఇంటి పైభాగం నుంచి దట్టమైన పొగతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోక.. కుటుంబసభ్యులంతా బయటకు పరుగులు తీశారు.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇంట్లోని గృహోపకరణాలు, సామగ్రి, నగదు మంటల్లో బుగ్గయ్యాయి. సుమారు 8 లక్షల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు.

ఇదీ చదవండి:

'ఫ్రంట్ లైన్ వారియర్స్​ను వేధింపులకు గురిచేయడం బాధాకరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.