ETV Bharat / state

కాకినాడలో 23 పూరిళ్లు దగ్ధం.. ఆదుకుంటామని మంత్రి హామీ - కాకినాడ అగ్నిప్రమాదంలో 23 ఇళ్లు దగ్ధం

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సూర్యారావుపేటలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 23 పూరిళ్లు దగ్ధమయ్యాయి. మత్స్యకారులు నివాసముండే ఈ పాకల్లో ప్రస్తుతం ఐదు కుటుంబాలే ఉంటున్నాయి. ఘటనాస్థలిని మంత్రి కన్నబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

కాకినాడలో 23 పూరిళ్లు దగ్ధం.. ఆదుకుంటామని మంత్రి హామీ
author img

By

Published : Nov 7, 2019, 12:04 AM IST

కాకినాడలో 23 పూరిళ్లు దగ్ధం.. ఆదుకుంటామని మంత్రి హామీ
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం సూర్యారావుపేటలో అగ్నిప్రమాదం సంభవించి 23 పూరిపాకలు దగ్ధమయ్యాయి. లైట్ హౌస్​ సమీపంలోని ఈ పూరిపాకల్లో మత్స్యకారులు నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఈ పూరిపాకల్లో 5 కుటుంబాలు మాత్రమే ఉంటున్నాయి. మిగతా పాకలు ఖాళీగా ఉన్నాయి. మంటల్లో వస్తు సామగ్రి మొత్తం కాలిపోయాయని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. ఘటనా స్థలాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్సీ సూర్యారావు పరిశీలించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

కచ్చులూరు బోటు ప్రమాదం... మత్స్యకారులకు ప్రభుత్వం తీపి కబురు

Intro:Ap_rjy_62_06_gas_facing_problems_av_ap10022Body:Ap_rjy_62_06_gas_facing_problems_av_ap10022Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.