తాటాకు ఇళ్లు దగ్ధం... రూ.1.50 లక్షలు నష్టం - ఈరోజు తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరంలో అగ్ని ప్రమాదం తాజా వార్తలు
రంపచోడవరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో.. 1.50 లక్షల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగిందని అధికారులు వెల్లడించారు. పొయ్యిలో ఎగసిపడ్డ నిప్పుల కారణంగా మంటలు వ్యాపించినట్లు అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ తెలిపారు.
అగ్ని ప్రమాదంలో దగ్ధమవుతున్న ఇళ్లు
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలోని రెడ్డిపేట వీధిలో అగ్ని ప్రమాదం జరిగింది. సుంకర శివసాయిరెడ్డి, దుర్గారెడ్డికి చెందిన ఇళ్లు దగ్ధమయ్యాయి. నిత్యావసర సరకులతో పాటు సామగ్రి కాలి బూడిదైంది. పొయ్యిలో ఎగసిపడిన నిప్పులు కారణంగా మంటలు అంటుకున్నట్లు తెలుస్తోందని రంపచోడవరం అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ తెలిపారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. సకాలంలో ప్రమాద స్థలానికి చేరుకున్న కారణంగా పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు. ఈ ఘటనలో రూ.1.50 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని వెల్లడించారు.