తెదేపా నేత బండారు సత్యనారాయణ మూర్తి వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. తెదేపా నేతలపై అక్రమంగా కేసులు పెట్టడమే ఎజెండాగా ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వపాలనను విమర్శించినందుకు కొల్లు రవీంద్రపై కేసు పెట్టడం అప్రజాస్వామికమని తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సమావేశంలో ధ్వజమెత్తారు. బలమైన బీసీ నాయకత్వాన్ని అణిచివేయడమే లక్ష్యంగా... ప్రభుత్వం కేసులు పెడుతూ దాడులకు పాల్పడుతోందని విమర్శించారు.
ఇదీ చదవండి: