వర్షాలు తగ్గి మామూలు పరిస్థితి ఉండటంతో మిగిలిన కొద్దిపాటి పంటను దక్కించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు రైతులు. వాతావరణం పొడిగా ఉండటంతో తూర్పుగోదావరి జిల్లాలో వరి కోత ప్రారంభించారు. తుపాన్ సమయంలో నేలకొరిగిన పంటను కోసేందుకు ఎక్కువ మంది కూలీలు అవసరమవుతున్నారని రైతులు చెబుతున్నారు.
ఇప్పటికే కోసి కుప్పలు వేసిన ధాన్యం తడిసిపోయింది. దాన్ని ఆరబెట్టేందుకు కూడా కూలీలను పెట్టుకోవాల్సి వస్తోంది. పంట మునిగి నష్టపోయిన రైతులకు ఇప్పుడు అధిక కూలీల వినియోగంతో ఆర్థికంగా మరింత భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: