పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను అర్హులందరికీ కేటాయించాలని, అన్నవరం గ్రామస్థులకు పంచాయతీ పరిధిలోనే స్థలాలు ఇవ్వాలని ఆర్డీవోను కలిసినందుకు తనపై తప్పుడు కేసులు పెట్టారని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం గ్రామ మాజీ సర్పంచ్, తెదేపా నేత మెరపల నర్సయ్య ఆరోపించారు.
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలతో అరెస్టై, బెయిల్ పై నర్సయ్య విడుదలయ్యారు. తుని, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంఛార్జీలు యనమల కృష్ణుడు, వరుపుల రాజా ఆయనను పరామర్శించారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకోవడం, కేసులు పెట్టడమే ప్రధాన స్కీములుగా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టి అణగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు.