'పోలవరం మొదలుకొని ఫించన్ల వరకు రద్దు చేశారు' - chinarajappa visits p gannavaram updates
రాష్ట్ర రాజధాని, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలు మొదలుకొని అనేక సంక్షేమ పథకాలను వైకాపా ప్రభుత్వం రద్దు చేసుకుంటూ వెళ్తోందని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అన్నా క్యాంటీన్లు, సామాజిక పింఛన్లు తొలగించి అనేక తప్పిదాలు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మాజీ సర్పంచ్ కొండలరావు మృతి పట్ల ఆయన సంతాపం తెలిపారు. కొండలరావు నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
నిమ్మకాయల చినరాజప్ప
By
Published : Feb 24, 2020, 5:34 PM IST
ప్రభుత్వ వైఖరిపై మాట్లాడుతున్న నిమ్మకాయల చినరాజప్ప