తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు హర్షకుమార్ జిల్లా ఎస్పీని కోరారు. సభ్య సమాజం సిగ్గు పడేలా ముక్కుపచ్చలారని బాలికపై లైంగిక దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జీజీహెచ్లో బాలిక కుటుంబ సభ్యులను హర్షకుమార్ సోమవారం పరామర్శించారు. రాష్ట్రంలో దళితులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి
కాకినాడలో దారుణం... నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యం