ETV Bharat / state

'రాష్ట్రంలో దాడులపై త్వరలోనే రాష్ట్రపతికి ఫిర్యాదు'

తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో దళిత యువకుడికి శిరోముండనం కేసులో అసలైన దోషులను పట్టుకోవాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. దళితులపై దాడులను అన్ని పార్టీలు ఖండించాలని కోరారు. ఎస్సీలపై జరుగుతున్న దాడులకు సంబంధించి రాష్ట్రపతిని కలవనున్నట్లు హర్షకుమార్ తెలిపారు.

ex mp harsha kumar on daliths
మాజీ ఎంపీ హర్షకుమార్
author img

By

Published : Jul 25, 2020, 2:07 PM IST

యువకుడికి శిరోముండనం వ్యవహారంలో అసలైన దోషులను పట్టుకోవాలంటూ మాజీ ఎంపీ హర్షకుమార్‌ బాధితుడు ప్రసాద్‌తో కలిసి ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో హర్షకుమార్‌ దీక్షకు కూర్చున్నారు. ఈ ఘటనలో కాల్‌ డేటా ద్వారా పోలీసులు నిందితులని పట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎవరికి వారు తమ ఇళ్లల్లోనే కూర్చుని మద్దతు తెలపాలని హర్షకుమార్‌ పిలుపునిచ్చారు.

తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్‌, భాజపా, జనసేన, వామపక్షాలు తదితర పక్షాలన్నీ తమకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. శిరోముండనం ఘటన, బాలిక సామూహిక అత్యాచారం, చీరాలలో లాఠీ దెబ్బలకు మృతిచెందిన యువకుడుతోపాటు ఎస్సీలపై జరుగుతున్న దాడులకు సంబంధించి న్యాయం చేయాలని త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామని హర్షకుమార్‌ చెప్పారు.

ఇదీ చదవండి: తండ్రి కష్టం చూడలేక.. కాడెద్దులుగా మారిన కూతుళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.