Children Drawing Competition in Vijayawada : ఏకాగ్రత, పట్టుదల దానికితోడు సృజనాత్మక జతకలిస్తే అద్భుత చిత్రాలు గీయగలరు చిన్నారులు. మట్టి ముద్దను సైతం ముద్దులొలికే బొమ్మలుగా మలిచే శక్తి ఆ చిట్టిచేతులకు ఉంది. చిన్నారుల్లో ఉన్న ఈ కళను వెలికి తీసేందుకు విజయవాడలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో మూడు జిల్లాల నుంచి వివిధ పాఠశాలకు చెందిన వేలాది విద్యార్థులు పాల్గొన్నారు. వారి చిన్ని చేతులతో ఎన్నో అందమైన బొమ్మలతో పాటు పర్యావరణ హితం కోరే చిత్రాలు సైతం గీశారు.
పోటీల్లో పాల్గొన్న 5వేల మంది విద్యార్థులు : అద్భత చిత్రాలకు ఆలోచనలే సోపానాలు. అలాంటి చిత్రలేఖనంలో మంచి ప్రతిభ కనబరిచారు ఎందరో విద్యార్థులు. కుంచె పడితే బొమ్మ పడాల్సిందే అన్న చందంగా వివిధ రంగవళ్లులతో మనసుదోచే చిత్రాలు గీసి ప్రాణం పోశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న చిత్రకళ నైపుణ్యం వెలికి తీసేందుకు విజయవాడ వేదికైంది. అనంత్ డైమండ్స్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల, డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలలకు చెందిన 200 పాఠశాలలు, కళాశాలలకు చెందిన దాదాపు ఐదు వెేల మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు.
శభాష్ - అభాగ్యులకు ఆత్మ బంధువు 'మన ఇల్లు'
ఈ పోటీల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగం వల్ల సంభవించే ముప్పు అవగాహన కలిగేలా గీసిన చిత్రాలు ఆలోచింపచేశాయి. తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకోనేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయని విద్యార్ధుల్లో ఆభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చిన్నారుల్లో దానిఉన్న ఎన్నో నైపుణ్యాలు : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఏటా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిభ పోటీ పరీక్షల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులు స్వీయ సామర్ధ్యాలను పెంపొందించుకోవచ్చని వివరించారు. చిన్నారుల్లో ఎదో ఒక నైపుణ్యం దాగి ఉంటుందని వాటిని ప్రదర్శించడానికి ఇలాంటి కార్యక్రమాలు వేదికగా మారుతాయని వివరించారు.
"నవంబర్ 14 బాలల దినోత్సవం సంర్భంగా చిత్రలేఖనం పోటీలు నిర్వహించాం. ఎన్టీఆర్, కృష్ట, గుంటూరు జల్లాల నుంచి 200 పాఠశాలలు, కళాశాలలకు చెందిన దాదాపు ఐదు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభని బయట పెట్టుకునేందుకు ఇది మంచి వేదిక. దీన్ని జడ్జీమెంట్ చేసి ఇదే క్యాంపస్‌లో బహుమతులు ఇస్తాం. పోటీల్లో పొల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తాం." - రమేష్, డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ
'అద్వితీయ 2024' - సందడి చేసిన విద్యార్థినులు - వివిధ రంగాల్లో నైపుణ్య ప్రదర్శన
'ఈ స్థాయిలో ఉండడానికి హార్డ్‌వర్క్, తల్లిదండ్రులే కారణం - ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యం'