ETV Bharat / state

'మునుగోడు ఉప ఎన్నికల్లో ఏం జరిగింది?' - మరో నలుగురు మాజీలకు నోటీసులు! - PHONE TAPPING CASE

ఫోన్​ ట్యాపింగ్​ కేసు - మరో నలుగురు​ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చినట్లు సమాచారం

Telangana Phone Tapping Case
Telangana Phone Tapping Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2024, 5:02 PM IST

Telangana Phone Tapping Case : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రమేయమున్న రాజకీయ నాయకుల డొంక కదులుతోంది. ఇప్పటికే నల్గొండ జిల్లా నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ కాగా, తాజాగా మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలనూ విచారణకు పిలిచినట్లు సమాచారం. వీరిలో ఇద్దరు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారు కాగా, మరో ఇద్దరు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన నేతలు.

మునుగోడు బైపోల్ సమయంలో ఏం జరిగింది? : మునుగోడు ఉపఎన్నిక సమయంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వీరు అప్పట్లో నడుచుకున్న తీరుపై విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. అప్పటి లావాదేవీలకు సంబంధించి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. అయితే నోటీసుల విషయాన్ని పోలీస్‌ ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. వీరిని ప్రశ్నించిన తర్వాత మరికొందరు కీలకమైన లీడర్లకూ నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.

ఇదే కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న అడిషనల్​ ఎస్పీ(సస్పెండెడ్‌) తిరుపతన్నతో జరిపిన ఫోన్‌ సంభాషణల నేపథ్యంలో చిరుమర్తి లింగయ్యను ఈనెల 11న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 14వ తేదీన వస్తానని ఆయన సమాధానమిచ్చారు. తిరుపతన్న క్రితంసారి శాసనసభ ఎన్నికల సమయంలో ప్రత్యేకంగా వాట్సప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేసి అభ్యర్థుల, ప్రతిపక్ష నేతల కదలికలపై తన బృందంతో సాంకేతిక నిఘా ఉంచారు. ప్రత్యర్థి పార్టీలకు ఆర్థిక వనరులు అందకుండా నియంత్రించేందుకు ఈ బృందం పనిచేసిందని దర్యాప్తు అధికారులు ఇప్పటికే గుర్తించారు.

భుజంగరావుకు షాక్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు మధ్యంతర బెయిల్ పొడిగింపు పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని ఇటీవల ఆయన పిటిషన్ ధాఖలు చేశారు. ఈ క్రమంలో పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. గురువారం(నవంబర్ 14)వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అనారోగ్య కారణాలతో భుజంగరావు మధ్యంతర బెయిల్ పొందారు. గురువారం నాడు మధ్యంతర బెయిల్​ గడువు ముగియనుంది.

ఫోన్ ​ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం- ప్రభాకర్​రావుపై రెడ్​కార్నర్​ నోటీసు! - Prabhakar Rao Red Corner Notices

ఫోన్​ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ - 'బీఆర్ఎస్ నేతల సూచనతో సెటిల్​మెంట్లు' - BHUJANGARAO ON PHONE TAPPING

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.