రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం.... తమిళనాడు తరహా కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ విమర్శించారు. వైఎస్ జగన్ సర్కార్ ప్రజా సంక్షేమాన్ని మరచి ప్రతిపక్షాలపై కేసులు బనాయించడమే పనిగా పెట్టుకుందని అన్నారు.
తాను కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐలో ఎలాంటి అవకతవకలు జరగలేదని పితాని చెప్పారు. వైకాపాలో చేరలేదనే తనపై బురద చల్లుతున్నారని అన్నారు. తాను విదేశాలకు, రహస్య స్థావరాలకు పారిపోయానని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తాను ఇంటివద్దే ఉన్నానని... ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పారు.
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి అరెస్టుల వ్యవహారంలో పోలీసులు భయాందోళనలు రేకెత్తించారని అన్నారు. మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైకాపాలో చేరిన వెంటనే... ఆయన సంస్థలకు మైనింగ్ అనుమతులు ఇచ్చేశారని వెల్లడించారు. ఈ వ్యవహారంతో వైకాపా ప్రభుత్వ నీతి అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: