ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు ఈటీవీ, ఈనాడు నిర్వహిస్తున్న కార్యక్రమాలు అనేక మందిలో స్పూర్తిని నింపుతున్నాయి. ఈనాడు - ఈటీవీ సంకల్పానికి పలువురు మద్దతు తెలుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా వస్త్ర సంచులు పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమాన్ని దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈవో త్రినాథరావు చేతులమీదుగా లైన్స్ క్లబ్ జోన్ చైర్మన్ పర్వత జానకీ దేవి ఉచితంగా భక్తులకు అందించి ప్లాస్టిక్ వినియోగించవద్దని అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ అవగాహన కల్పిస్తోన్న ఈటీవీ, ఈనాడును అభినందించారు.
ఇదీ చదవండి: