ETV Bharat / state

మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు: ఏలూరు రేంజ్ డీఐజీ

మహిళల రక్షణ కొరకు దిశ పోలీస్ స్టేషన్​లు ఏర్పాటు చేశామని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ. మోహన్ రావు స్పష్టం చేశారు. మహిళలతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు

author img

By

Published : Dec 26, 2020, 9:09 PM IST

మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు చేపడతామని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ. మోహన్ రావు హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు పోలీస్​స్టేషన్​లో సాధారణ తనిఖీలు చేసిన ఆయన... మహిళల రక్షణ కొరకు దిశ పోలీస్ స్టేషన్​లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆపద సమయంలో వారికి సహాయం చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులోకి తెచ్చామన్నారు.

గతేడాది కంటే ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్న డీఐజీ.. ఇటీవలి కాలంలో ఆన్​లైన్ మోసాలు ఎక్కువయ్యాయన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు.. ఓటీపీ నంబర్ అపరిచితులకు వెల్లడించవద్దని చెప్పారు. ఆన్​లైన్ మైక్రో ఫైనాన్స్ ఉచ్చులో ఎవరూ పడొద్దని సూచించారు. పండుగల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే.. ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని చెప్పారు.

ఇదీ చదవండి:

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.