తూర్పుగోదావరి జిల్లా యు. కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపలరేవులో గురువారం మత్స్యకారులకు భారీ ట్యూనా చేప దొరికింది. ఏడు అడుగుల పొడవు, ఎనభై కిలోల బరువున్న ఈ ట్యూనా చేప మత్స్యకారులకు చిక్కడంతో దీనిని తీరం ఒడ్డుకు చేర్చడానికి తీవ్రంగా శ్రమించారు. ఈ చేపను ఓ వ్యాపారి ఏడు వేల రూపాయలకు కొనుగోలు చేసి.. కేరళకు ఎగుమతి చేశాడు. ఇంత భారీ చేప ఉప్పాడ చేపలరేవులో దొరకడంతో సందర్శకులు ఫొటోలు తీసుకునేందుకు పోటీపడ్డారు.
ఇదీ చూడండి. అబ్బో.. ఈ కంద ఎంత పెద్దదో