కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఐదేళ్ల బాబుకు శస్త్ర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 18 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా మొండెపు లంక గ్రామానికి చెందిన బొమ్మిడి రాజకుమార్ అనే ఐదు సంవత్సరాల బాబుకు కాలేయ మార్పిడి నిమిత్తం 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు.
నిరుపేద కుటుంబానికి చెందిన బాబు తల్లిదండ్రులు అమలాపురం ఎంపీ చింతా అనురాధ ద్వారా సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో 18 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. ఈ మొత్తానికి సంబంధించిన ఎల్ఓసీ ని ఎంపీ అనురాధ.. రాజ్‌కుమార్ తల్లిదండ్రులకు అందజేశారు. చికిత్స అందించే ఈ సొమ్మును ఆసుపత్రికి నగదు రూపంలో జమ అవుతుందని ఎంపీ అనురాధ వెల్లడించారు.
ఇదీ చదవండీ.. Notice: పరీక్షలు రద్దు చేయని ఏపీ సహా 4 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు