ఈనాడు-ఐసీఎఫ్ఏఐ సంయుక్త ఆధ్వర్యంలో చదువు-కొలువు అంశంపై రాజమహేంద్రవరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్థేశించుకుని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషిక్త్ కిషోర్ అభిప్రాయపడ్డారు. విశ్వవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడే కోర్సులపై ఆసక్తి పెంచుకోవాలని ఐసీఎఫ్ఏఐ ప్రొఫెసర్ రేఖారాజ్ జైన్ అన్నారు. సంస్థ అడ్మిషన్స్ ఇంచార్జ్ లక్ష్మీనారాయణ ఇంజినీరింగ్ రంగంలో వస్తున్న మార్పులు, కోర్సులపై అవగాహన కల్పించారు. ప్రణాళికతో కూడిన విద్య, నిరంతర శ్రమ ద్వారానే లక్ష్యాలను చేరుకోవచ్చని...అప్పుడే కలలు నెరవేరతాయని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు సుభాష్ అన్నారు. చదువు-కొలువు సదస్సుపై ఈనాడు రాజమహేంద్రవరం ఇంఛార్జ్ చంద్రశేఖర ప్రసాద్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండీ: