ప్రభుత్వ పాఠశాలల్లో నీటిగంట అమలు తీరుపై 'ఈనాడు- ఈటీవీ భారత్' బృందం చేసిన అధ్యయనంలో ఆందోనళనకర విషయాలు బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా తుని జడ్పీ బాలికోన్నత పాఠశాలలో 1100 మంది విద్యార్థినులకు కోరికోరి రోగాలు అంటించిట్టుగా పరిస్థితులు తయారవుతున్నాయి. ఈ బడిలో ఉన్న నీటి ట్యాంకు లోపల తుప్పు పట్టింది. అందులో నీరు కలుషితమైంది. మరో ట్యాంకులోని నీటిలో వ్యర్థాలు, చిన్నచిన్న పురుగులు ఉన్నాయి. బడిలోని ఆర్వో ప్లాంటు పాడైపోయింది. నీటి డబ్బాలు ఉన్నా ఖాళీగానే కనిపిస్తున్నాయి.
బడిగంట కార్యక్రమం బాగానే ఉన్నా... ఇలా కలుషితమైన నీటిని మాత్రం తాగలేకపోతున్నామని చిన్నారులు ఆవేదన చెందుతున్నారు. బయట కొనుక్కోవాల్సి వస్తోందని చెప్పారు. ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. తునిలోనే కాదు... మరికొన్ని పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. లక్ష్యం మంచిదైనా... ఆచరణ లోపమే అసలు సమస్యగా మారింది.
ఇదీ చదవండి: ఈనాడు కథనానికి సీఎం స్పందన.. చిన్నారి కళ్లకు భరోసా