జీఓ నెంబర్ 3కి సంబంధించి ఆదివాసీలు మరోసారి గళమెత్తారు. ఈ అంశంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా మన్యంలో బంద్ నిర్వహించారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో... మండలంలోని చట్టి, ఏడుగురాళ్లపల్లి వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఆదివాసీలకు వందశాతం రిజర్వేషన్ అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:కట్లు కట్టాలన్న.. కుట్లు వేయాలన్నా సెక్యూరిటీ గార్డే!