రెండు జిల్లాల సరిహద్దు గ్రామాలవి.. రెండు ఊరులు ఆనుకొని ఉంటాయి.. ఈ రెండు గ్రామాలకు సరిహద్దులంటూ ఉండవు... గుంతలు, విద్యుత్ స్తంభాలు, నీటి కుళాయిలే హద్దులుగా చెప్పుకుంటారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే... ద్వారబంధం ఒక జిల్లాలోకి వస్తే... ఇల్లు మాత్రం మరో జిల్లా హద్దులోకి వస్తుంది! అవునండీ ఇది నిజమే..! తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం భీమవరపుకోట, విశాఖ జిల్లా నాతవరం మండలం వైబీ పట్నం గ్రామాల ప్రత్యేకతే ఇదీ!
పేరులే వేరు.. అన్నింటా కలిసే ఉంటారు
తూర్పు గోదావరి- విశాఖ జిల్లాల సరిహద్దుల్లో భీమవరపు కోట, వైబీ పట్నం గ్రామాలు ఉన్నాయి. పేరుకు రెండు గ్రామాలే కానీ.. ఒకటిగానే ఉంటాయి. గ్రామంలో జరిగే అమ్మవారి జాతర రెండు ఊర్ల ప్రజలు కలిసే చేసుకుంటారు. రెండు పంచాయతీలకు భీమవరపుకోటలోనే ఉన్నత పాఠశాల, వసతి ఉన్నాయి. భీమవరపుకోటలో 725 ఇళ్లు ఉండగా.. వైబీ పట్నంలో 500 నివాసాలు ఉన్నాయి.
బ్రిటీష్ వారి కాలం నుంచే..
1944కు ముందు నుంచి.. బ్రిటీష్ వారి కాలంలో రెండు గ్రామాల మధ్య వేసిన రాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. వాటి ఆనవాళ్లగాను కూడా ఏ గ్రామం.. ఏ జిల్లాలోకి వస్తుందో లెక్క వేసుకుంటారు ఇక్కడి ప్రజలు.
పంచాయతీ ఎన్నికలు..
భీమవరపు కోటలో మెుదటి దశలో పంచాయతీ ఎన్నికలు జరగనుండగా.. వైబీ పట్నంలో రెండో దశలో జరగనున్నాయి.
ఇదీ చదవండి: మీకు తెలుసా.. పోలింగ్ సామగ్రిలో ఎన్ని వస్తువులుంటాయో?