తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో నాలుగు చోట్ల కాజ్ వేలు నిర్మించేందుకు గత ప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేసింది. అవి మంజూరు కాక లంక గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పి గన్నవరం నియోజకవర్గంలో ముక్తేశ్వరం, కె ఏనుగుపల్లి, లంక శివాయి, లంక అప్పనపల్లి నాలుగు చోట్ల కాజు వేలు లేకపోడవం వల్ల వరదల సమయంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరక సమస్య తీరడం లేదు. మళ్ళీ వరదల కాలం వచ్చేసింది. ప్రజల కష్టాలు మళ్ళీ మొదలవుతున్నాయి. గతేడాది ఆగస్టులో వచ్చిన ఉద్ధృత వరదలకు మంత్రి విశ్వరూప్ శివాయ లంక గ్రామానికి ట్రాక్టర్లో వెళ్లి ఆ గ్రామ ప్రజలను పరామర్శించారు. తప్పకుండా కాజ్వే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ నిధులు మంజూరు కాలేదు. నాలుగు చోట్ల కాజల్ వేలు నిర్మించేందుకు ఇప్పటికైనా పాలకులు, అధికారులు చొరవ చూపాలని ఆయా గ్రామాల ప్రజలు మొరపెట్టుకుంటున్నారు.
ఇదీ చదవండి :