ETV Bharat / state

వారందరికీ రుణపడి ఉంటా: ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు

author img

By

Published : Aug 25, 2020, 8:14 PM IST

తాను కొవిడ్​ నుంచి కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు తూర్పుగోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు. పది రోజుల కిందట ఆయన కొవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

mandapeta mla
మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు

పది రోజుల కిందట కరోనా బారిన పడిన తూర్పుగోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే హైదరాబాద్​లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నియోజకవర్గ ప్రజలందరి ఆశీస్సులతో తాను కోలుకున్నట్లు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి ఓ వీడియో విడుదల చేశారు.

తన ఆరోగ్యం కోసం మసీదులు, చర్చ్ లు, దేవాలయాల్లో పూజలు చేసిన వారందరికీ జీవితాంతం రుణపడి వుంటానన్నారు. నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు వాట్సాప్ ల ద్వారా తన క్షేమాన్ని ఆకాంక్షించారని.... వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. తనకు ప్రస్తుతం కరోనా పరీక్షలు జరపగా నెగిటివ్ వచ్చిందన్నారు. దీంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు చెప్పారు. అయినప్పటికీ వైద్యుల సూచనల మేరకు వారం రోజులపాటు హైదరాబాద్​లోనే ఉండాల్సి ఉందన్నారు. మూడు రోజులకు ఒకసారి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారన్నారు. పరీక్షల అనంతరం త్వరలోనే మండపేట చేరుకుంటానని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి: కొవిడ్ మృతదేహాలను తీసుకెళ్లే అంబులెన్సులకు నిర్ణీత ఛార్జీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.