తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు నత్తనడకన సాగుతున్నాయని తెలుగుదేశం సభ్యులు ఆరోపించారు. నగరంలో కొవిడ్ కేసులు విజృంభిస్తున్నా మద్యం విక్రయాలను మాత్రం నియంత్రించడం లేదని విమర్శించారు. కరోనా కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లపోవటంతో.. వారి జీవనోపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, తెలుగుదేశం లేవనెత్తిన ప్రశ్నలకు అభ్యంతరం తెలిపారు. నగరంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ఇదీ చదవండి: బ్రేక్ వేయబోయి ఎక్స్ లెటర్ తొక్కాడు.. బీభత్సం సృష్టించాడు...