కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ, పర్యవేక్షణకు జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తొలిదశలో 35వేల మంది హెల్త్‌కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ పంపిణీ చేసేలా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కాకినాడలోని కలెక్టరేట్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన... టీకా పంపిణీ విషయంలో దుష్ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కొవిడ్ రెండోదశ విజృంభిస్తున్నందున... ప్రజలను అప్రమత్తం చేసేందుకు 50 రోజులపాటు కరోనాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: