ETV Bharat / state

మడ భూములు కాదు.. పోర్టు భూములే ఇస్తాం: కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లాలో పేదల ఇళ్ల స్థలాల కోసం... 7 వేల ఎకరాల భూములు సేకరించినట్లు జిల్లా పాలనాధికారి మురళీధర్ రెడ్డి తెలిపారు. కాకినాడలో మడ భూములు కాదు.. పోర్టు భూములే ఇళ్ల స్థలాలుగా ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

east godavari collector muralidhar reddy speaks about collection of lands for poor
పేదల ఇళ్ల స్థలాలపై కలెక్టర్ వివరణ
author img

By

Published : May 24, 2020, 11:44 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో 3 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల కోసం... 7 వేల ఎకరాల భూములు సేకరించినట్లు జిల్లా పాలనాధికారి మురళీధర్ రెడ్డి తెలిపారు. కాకినాడలో మడ భూములు కాదు.. పోర్టు భూములే ఇళ్ల స్థలాలుగా ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇళ్ల పట్టాల కోసం రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వస్తే స్వీకరిస్తామని తెలిపారు.

వరద సీజన్ మొదలయ్యేలోగా పోలవరం నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. ఆలోగా పూర్తికాకపోతే నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తామని తెలిపారు. ప్రభుత్వ భూముల విక్రయ ప్రతిపాదనలో... రాజమహేంద్రవరం జైలు భూములు లేవని, జైలులో ఖాళీ భూమి అమ్మకానికి పెట్టలేదని దానిని వైద్య కళాశాలకు వినియోగించే ప్రతిపాదన ఉందని ఆయన వివరించారు.

ఇదీ చదవండి:

మరో ముగ్గురు సోషల్ మీడియా యాక్టివిస్టులకు పోలీసుల నోటీసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.