గోదావరి వరదతో పంటలు నీట మునిగాయి. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని గోదావరి వరద కారణంగా వారం రోజులుగా పంట పొలాలు నీటిలోనే ఉన్నాయి. ఇప్పటికే కూరగాయల తోటలు పూర్తిగా పాడైపోగా.. అరటి తోటలు కుళ్లిపోతున్నాయి. చెట్టు కింద భాగం నీటిలోనే ఉండడంతో కుళ్ళిపోయి ఆకులు పసుపు రంగులో మారి ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి
రమేష్ ఆసుపత్రి ఎండీపై తదుపరి చర్యలు నిలిపివేయండి: హైకోర్టు