పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తమను సొంత రాష్ట్రాలకు పంపాలంటూ కార్మికులు కొంత కాలంగా ఆందోళన చేస్తున్నారు. ఇటీవల కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం పంపుతామని అధికారులు చెప్పడంతో ప్రాజెక్ట్ ప్రాంతం నుంచి కార్మికులు బయటకు వచ్చారు.
కడెమ్మ వంతెన వద్దకు సుమారు 600 మంది కార్మికులు చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోగా... వెంటనే తమను సొంత రాష్ట్రాలకు పంపాలంటూ నినదించారు. అనుమతులు రాగానే కొవ్వూరు నుంచి ప్రత్యేక రైళ్ల ద్వారా పంపుతామని పోలీసులు, రెవెన్యూ అధికారులు చెప్పినా కార్మికులు ఆందోళన విరమించలేదు. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉండటంతో అదనపు బలగాలను దించారు.
ఇదీ చదవండి: