కరోనా కారణంగా లాక్డౌన్ కొనసాగుతున్న ఈ సమయంలో.. అరటి రైతులు, వ్యాపారులు విలవిల్లాడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట వ్యవసాయ మార్కెట్లో పెద్ద సంఖ్యలో అరటి విక్రయాలు జరుగుతుంటాయి. అలా కొనుగోలు చేసిన అరటి గెలలను వ్యాపారులు అక్కడి నుంచి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. లాక్ డౌన్ కారణంగా అరటి పళ్ల అమ్మకాలు పడిపోయాయి. రైతులు తోటలో నుంచి అరటి గెలలు తీసుకొచ్చి అమ్మకానికి ఉంచినా.. వ్యాపారులు కొనుగోళ్లకు ముందుకు రాని కారణంగా మార్కెట్లోనే గెలలను వదిలేస్తున్నారు.
మగ్గిపోయి.. కుళ్ళిపోతున్న అరటిని చూసి రైతులు కుంగిపోతున్నారు. పండించిన అరటి.. పెంటపాలు అవుతోందని రోదిస్తున్నారు. మార్కెట్లో అరటిపళ్ల దుకాణాలను సాయంత్రం వరకు ఉంచితే కొంత మేలు కలుగుతుందని రైతులు, వ్యాపారులు అంటున్నారు. మొత్తం మీద కరోనా వైరస్ అరటి మార్కెట్‌ను చావు దెబ్బ తీసిందని... తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు మొర పెట్టుకుంటున్నారు.
ఇదీ చదవండి: