ETV Bharat / state

Equipment's for disabled : దివ్యాంగులకు పరికరాలు అందజేసిన జిల్లా జడ్జి

దివ్యాంగుల సంక్షేమానికి గురుదేవా ట్రస్టు ( Gurudeva Trust for Disabled Welfare) సేవలు అందించడం అభినందనీయమని తూర్పుగోదావరి జిల్లా జడ్జి భవిత అన్నారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల (Govt. Junior College) మైదానంలో 140 మంది దివ్యాంగులకు పరికరాలను అందజేశారు.

Equipment's for disabled
దివ్యాంగులకు పరికరాలు అందజేసిన జిల్లా జడ్జి
author img

By

Published : Sep 25, 2021, 7:50 PM IST

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల (Govt. Junior College) మైదానంలో 140 మంది దివ్యాంగులకు శనివారం పరికరాలను పంపిణీ చేశారు. శ్రీకాకుళానికి చెందిన గురుదేవ ట్రస్ట్ ( Gurudeva Trust for Disabled Welfare) సహకారంతో దివ్యాంగులకు సమకూర్చిన కృత్రిమ చేతులు, కాళ్లు, వినికిడి యంత్రాలు, వీల్ ఛైర్లను తూర్పుగోదావరి జిల్లా జడ్జి భవిత అందజేశారు. దివ్యాంగుల సంక్షేమానికి గురుదేవా ట్రస్టు సేవలు అందించడం అభినందనీయమని ఆమె ప్రశంసించారు. ఈ ఏడాది మార్చి 10వ తేదీన ఇదే ప్రాంగణంలో దివ్యాంగుల కొరకు మెడికల్ క్యాంప్ (Medical Camp) ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అప్పట్లో గుర్తించిన కొంతమంది దివ్యాంగులకు ఈరోజు పరికరాలను అందించారని తెలిపారు.

జిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీ సెక్రటరీ కె వి ఎల్ హిమబిందు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్, ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి స్థానిక కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : PULASA FISH: పులస కోసం ఎగబడ్డ జనం.. ధర ఎంతో తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.