ETV Bharat / state

బియ్యం బస్తాలు మోస్తూ... ఇంటింటికీ పంపిణీ

author img

By

Published : Apr 25, 2020, 2:39 AM IST

లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ప్రజల అవస్థను చూసి చలించిపోయాడు ఓ ప్రజాప్రతినిధి. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏదో రకంగా సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. మీకు నేనున్నానంటూ ఆపన్నహస్తం అందించాడు. 25 కేజీల బియ్యం బస్తాను స్వయంగా మోస్తూ ఇంటింటికీ తిరిగి పంపిణీ చేసి.. ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.

Distribution of rice bastards to the household in rajanagaram
బియ్యం బస్తాలు మోస్తూ ఇంటింటికీ పంపిణీ చేస్తున్న రాజానగరం ఎమ్మెల్యే

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.. నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రాజా ఇంటింటికీ తిరుగుతూ 25 కేజీల బియ్యం బస్తాను భుజంపై మోస్తూ స్వయంగా పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం రూరల్ వెంకటనగరం గ్రామ మాజీ సర్పంచ్ ఉప్పులూరి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో 650 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

ఇదీచదవండి.

సున్నా వడ్డీ రుణాలు కొత్తగా ప్రవేశపెట్టినట్టు ప్రచారం చేస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.